కాగా, పవన్ కళ్యాణ్ తన సందేశాన్ని ఇలా తెలియజేశారు. శ్రీ కీరవాణి గారి తండ్రి, రచయిత, చిత్రకారులు శ్రీ శివశక్తి దత్తా గారు కన్ను మూశారని తెలిసి చింతించాను. శ్రీ దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కళలు, సాహిత్యంపై ఎంతో అభిమానం కలిగినవారాయన. తెలుగు, సంస్కృత సాహిత్యాలపై పట్టున్న శ్రీ దత్తా గారు పలు చలనచిత్రాలకు గీత రచన చేశారు. పితృ వియోగంతో బాధపడుతున్న శ్రీ కీరవాణి గారికి, ఆయన సోదరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని ప్రకటన విడుదల చేశారు.