యూనిస్ కెప్టెన్సీలో ప్రపంచ కప్ సాధిస్తాం: అక్తర్

గురువారం, 12 మార్చి 2009 (12:07 IST)
FileFILE
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టిన సీనియర్ బ్యాట్స్‌మెన్, మంచి అనుభవజ్ఞుడైన యూనిస్ ఖాన్ నేతృత్వంలో 2011 ప్రపంచ కప్‌ను తమ దేశం కైవసం చేసుకుంటుందని "రావల్పిండి ఎక్స్‌ప్రెస్" షోయబ్ అక్తర్ ధీమా వ్యక్తం చేశాడు. అలాగే, తిరిగి జట్టులో స్థానం సంపాదించేందుకు తాను తీవ్రంగా శ్రమిస్తున్నట్టు చెప్పాడు.

ఇస్లామాబాద్‌లో అక్తర్ మాట్లాడుతూ హుందాతనమైన నాయకత్వ లక్షణాలు, విశాలదృక్పథంతో కూడిన వ్యవహార శైలి యూనిస్ సొంతమన్నాడు. ఇది జట్టుకే కాకుండా.. బోర్డుకు ఎంతగానో మేలు చేస్తాయన్నారు. అందువల్ల యూనిస్ కెప్టెన్సీలో వచ్చే 2011 ప్రపంచ కప్‌ను తమ దేశ క్రికెటర్లు కైవసం చేసుకుంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు.

అయితే, తనను జాతీయ జట్టు నుంచి తొలగించడం పట్ల అక్తర్ ఒకింత బాధను వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు నన్ను పక్కన పెట్టడం క్షోభకు గురి చేసింది. త్వరలోనే తిరిగి జట్టులో చేరుతానని అక్తర్ ధీమా వ్యక్తం చేశాడు.

తటస్థ వేదికపై ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌కు జట్టులో చోటు సంపాధిస్తానని చెప్పాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో స్థానం పొందిన అక్తర్, నిరాశాజనకమైన ప్రదర్శన కారణంగా జట్టు నుంచి తొలగించిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి