శ్రీలంక సెలెక్టర్లు బుధవారం కీపర్ కుమార సంగక్కరకు జాతీయ క్రికెట్ జట్టు సారథ్య బాధ్యతలను అప్పగించారు. కాగా, శ్రీలంక క్రికెట్ జట్టుకు 2006 నుంచి సంగక్కర వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే..!
ఇటీవలనే... కెప్టెన్ మహేళ జయవర్దనే ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడంతో, సంగక్కరకు ఈ అవకాశం వచ్చింది. అలాగే వైస్‌కెప్టెన్సీ బాధ్యతలను ఆఫ్‌స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌కు సెలెక్టర్లు అప్పజెప్పారు. వీరిద్దరి సారథ్యంలో శ్రీలంక జట్టు జూన్‌లో ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇచ్చే ఐసీసీ ట్వంటీ20 ప్రపంచకప్‌లో పాల్గొననుంది.
ఈ టోర్నమెంట్ కోసం శ్రీలంక సెలెక్టర్లు 25 మందితో కూడిన సభ్యుల బృందాన్ని కూడా ఎంపిక చేశారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే దేశవాళీ ట్వంటీ 20 టోర్నమెంట్ అనంతరం తుది 15 మందిని ఎంపిక చేస్తారు.