రాహుల్ ద్రావిడ్ ప్రొఫైల్...

శనివారం, 22 మార్చి 2008 (16:33 IST)
FileFILE
భారత క్రికెట్‌లో రాహుల్ ద్రావిడ్‌ది అత్యంత కీలమైన పాత్ర. అటు బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తూనే.. అవసరమైతే వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ ద్విపాత్రాభినయం చేయగల క్రికెటర్. అయితే వన్డే జట్టుకు ఏమాత్రం తగడని ముద్ర పడిన తర్వాత ఆ ఛట్రం నుంచి బయటపడి ఏకంగా భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన ఆటగాడు "ది వాల్". మైదానంలో దిగితే ఎపూడు ప్రశాంత వదనంతో కనిపించే రాహుల్ ద్రావిడ్.. నిజ జీవితంలోను అలాగే నడుచుకుంటూ అందరి ప్రశంసలు పొందుతున్న క్రికెటర్.

పూర్తి పేరు.. రాహుల్ శరద్ ద్రావిడ్
పుట్టిన తేది.. 1973, జనవరి 11, మధ్యప్రదేశ్
ప్రస్తుత వయస్సు.. 35 సంవత్సరాల 71 రోజులు
ప్రధానంగా ఆడే జట్లు.. భారత్, స్కాట్లాండ్, ఆసియా XI, ఐసిసి ప్రపంచ XI, కర్ణాటక, కెంట్.
నిక్ నేమ్.. ది వాల్
బ్యాటింగ్ స్టైల్.. రైట్ హ్యాండెడ్
బౌలింగ్ స్టైల్.. రైట్ ఆర్మ ఆఫ్ బ్రేక్
ఫీల్డింగ్ స్థానం.. ఫస్ట్ స్లిప్
విద్యాభ్యాసం.. సెయింట్ జోసెఫ్ బాలుర హైస్కూలు.

కెరీర్ వివరాలు...
టెస్టులు.. 119
ఇన్నింగ్స్.. 205
పరుగులు.. 9920
అత్యధిక స్కోరు.. 270
సగటు.. 55.11 శాతం
సెంచరీలు.. 24
అర్థ సెంచరీలు.. 51

వన్డేలు.. 333
ఇన్నింగ్స్.. 308
పరుగులు.. 10,585
అత్యధిక స్కోరు.. 153
సగటు.. 39.49
సెంచరీలు.. 12
అర్థ శతకాలు.. 81.

వెబ్దునియా పై చదవండి