ధోనీలో ఆ చురుకుదనం సన్నగిల్లలేదు. ఆయన మెరుపు వేగంలో ఏమాత్రం మార్పు రాలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ వికెట్ కీపింగ్‌పై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. పదేళ్ల క్రితం ధోనీలో వుండిన హుషారు, వేగం అదేలా వుందని ఐసీసీ కూడా కితాబిచ్చింది.
అలాగే 2009లో కూడా కివీస్ గడ్డపై ఆడుతుండగా.. యువీ బంతిని ధోనీ ఇదే తరహా రనౌట్‌గా మార్చాడు. ప్రస్తుతం పది సంవత్సరాల తర్వాత 2019లోనూ అదే విధంగా రనౌట్ చేయడం స్వాగతించాల్సి విషయమని, అభినందించాల్సిన రనౌట్ అని క్రీడా పండితులు అంటున్నారు.