స్థానిక కుర్రాడు గౌతం గంభీర్ గర్జించాడు. సొంత గడ్డపై పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో సెంచరీ కొట్టాడు. మొహాలీ టెస్ట్.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన గంభీర్.. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో అదే జోరును కొనసాగించి, కెరీర్‌లో మూడో టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 189 బంతుల్లో 105 పరులుగు చేశాడు. 99 పరుగుల మీద ఉన్న గంభీర్ సిక్స్ బాది సెంచరీ పూర్తి చేయడం గమనార్హం.
ప్రస్తుతం గంభీర్ 124, లక్ష్మణ్ 34 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు.. 27 పరుగులకే రెండు ప్రధాన వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను గంభీర్, సచిన్ టెండూల్కర్‌లు గట్టెక్కించిన విషయం తెల్సిందే. వీరిద్దరు మూడో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 157 పరుగుల వద్ద సచిన్ జాన్సన్ బౌలింగ్‌లో హ్యాడ్డిన్ క్యాచ్ పట్టడంతో 68 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.