నాగ్‌పూర్ టెస్ట్: ఆరో వికెట్‌ను కోల్పోయిన భారత్

వీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్లను కోల్పోయింది. ఓపెనింగ్ అదిరినప్పటికీ.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ పూర్తి నిరాశకు గురి చేశారు. ఓపెనర్లు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత 163 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలుత మురళీ విజయ్ అవుట్‌తో క్రీజ్‌లోకి వచ్చిన ద్రావిడ్ (3) మరోమారు నిరాశపరిచాడు.

అలాగే.. లక్ష్మణ్ (4), గంగూలీ (0)లు కూడా అదేబాటలో పయనించారు. అయితే మరో ఓపెనర్ సెహ్వాగ్ మరో మారు ఎనిమిది పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. సచిన్, ధోనీలు ఆచితూచి ఆడారు. ఆస్ట్రేలియా స్పిన్నర్ క్రేజా మరోమారు భారత బ్యాట్స్‌మెన్స్‌పై ఆధిపత్యం చెలాయించాడు.

లక్ష్మణ్, గంగూలీలను ఒకే ఓవర్‌లో వరుస బంతులకు అవుట్ చేసి, పట్టు సాధించాడు. అయితే నాలుగో రోజు మధ్యాహ్నం టీ విరామ సమయంలో సచిన్ టెండూల్కర్ (12) రన్‌అవుట్ అయ్యాడు. దీంతో భారత్ ఆరో వికెట్‌ను 166 పరుగుల వద్ద కోల్పోయింది.

వెబ్దునియా పై చదవండి