ఈ సందర్భంగా ప్రధాని మోదీ, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఢిల్లీ ప్రజలు ఇచ్చిన ప్రజా తీర్పును తాను గౌరవిస్తున్నానని, ప్రజల ప్రయోజనం కోసం తాను పోరాడుతూనే ఉంటానని కేజ్రీవాల్ అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల కోసం పోరాడడానికేనని ఆయన తన బహిరంగ ప్రకటనతో స్పష్టంగా చెప్పారు
అలాగే ఢిల్లీలో బీజేపీ గెలవడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. హస్తినను హస్తం చేసుకోవాలనే తన చిరకాల కల చివరకు నెరవేరిందని చెప్పారు. "జనశక్తి అత్యంత ముఖ్యమైనది. అభివృద్ధి గెలుస్తుంది, సుపరిపాలన గెలుస్తుంది. బిజెపికి ఈ అద్భుతమైన, చారిత్రాత్మక తీర్పు ఇచ్చినందుకు నేను ఢిల్లీకి చెందిన నా ప్రియమైన సోదరీమణులు, సోదరులకు నమస్కరిస్తున్నాను.
ఈ ఆశీర్వాదాలను పొందడం మాకు చాలా గౌరవంగా ఉంది. ఢిల్లీని అభివృద్ధి చేయడంలో, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో, విక్షిత్ భారత్ నిర్మాణంలో ఢిల్లీకి ప్రధాన పాత్ర ఉందని నిర్ధారించడంలో మేము ఏ రాయిని కూడా వదులుకోబోమని మేము హామీ ఇస్తున్నాము" మోడీ ట్వీట్ చేశారు.