మూడో వన్డే: ఇంగ్లాండ్ బ్యాటింగ్

భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య స్వదేశంలో జరుగుతున్న హీరోహోండా సిరీస్‌లో భాగంగా మూడో వన్డే గురువారం కాన్పూర్‌లో ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ పీటర్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా ప్రారంభమైంది.

మ్యాచ్‌ జరిగే గ్రీన్‌పార్క్ మైదానంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. కాగా, గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమైన ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మకు తుది జట్టులో చోటు దక్కింది. ఇరు వైపుల తుది జట్ల వివరాలు ఇలా వున్నాయి.

ఇంగ్లాండ్ జట్టు.. రవి బొపరా, బెల్, ప్రయర్, షా, పీటర్సన్, ఫ్లింటాఫ్, కాలింగ్‌వుడ్, పటేల్, బ్రాడ్, స్వాన్, ఆండర్సన్.

భారత జట్టు.. సెహ్వాగ్, గంభీర్, రైనా, ధోనీ, యువరాజ్, రోహిత్ శర్మ, పఠాన్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, మునాఫ్ పటేల్.

వెబ్దునియా పై చదవండి