యువరాజ్ శతకం: భారత్ స్కోరు 223/5

టీం ఇండియా బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీతో కదం తొక్కాడు. తొలి వన్డేలో మెరుపు సెంచరీతో ఆకట్టుకున్న యువీ సోమవారం జరుగుతున్న ఇండోర్ వన్డేలోనూ తన హవా కొనసాగిస్తున్నాడు.

ఈ రెండో వన్డేలో యువరాజ్ సింగ్ 116 బంతుల్లో 105 పరుగులు చేసి స్కోరు బోర్డుకు వెన్నుముకగా నిలిచాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న టీం ఇండియా 42 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది.

తొలి వన్డేలో వెన్నునొప్పితో బరిలోకి దిగిన యువీ... 138 పరుగులు చేసి "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు"ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

యువరాజ్‌కు కాసేపు అండగా నిలిచిన టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కాలింగ్‌వుడ్ బౌలింగ్‌లో 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటవడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన పఠాన్ 11 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

వెబ్దునియా పై చదవండి