రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 387 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. భారత్ గడ్డపై ఇప్పటివరకు నమోదయిన అత్యధిక స్కోరు 386 పరుగులు కాగా, తాజా మ్యాచ్‌లో భారత్ దీనిని సవరించింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ (138) అజేయ సెంచరీతో భారీ స్కోరుకు బాటలు వేశాడు.
యువీ 16 ఫోర్లు, సెహ్వాగ్ 10 ఫోర్లు, గంభీర్ 8 ఫోర్లు, ధోనీ మూడు ఫోర్లు, ఇషాంత్ శర్మ 1 బౌండ్రీతో భారత్ తన ఇన్నింగ్స్ మొత్తానికి 38 బౌండ్రీలను సాధించింది. యువరాజ్ సింగ్ 78 బంతుల్లోనే 16 ఫోర్లు, ఆరు సిక్సర్లు చేశాడు. అదే విధంగా కెప్టెన్ ధోనీ 32 బంతుల్లో ఒక సిక్సర్, 3 బౌండ్రీలతో 39 పరుగులు చేశాడు.
మొత్తానికి ఇంగ్లండ్ బౌలింగ్ తీరు పేలవంగా ఉందనిని క్రికెట్ పండితుల అభిప్రాయం. బ్రాడ్ పది ఓవర్లలో 74 పరుగులు, ఫ్లింటాఫ్ పది ఓవర్లలో 67 పరుగులు, స్టీవ్ హర్మిసన్ పది ఓవర్లలో 75 పరుగులు, స్పిన్నర్ సమీద్ పటేల్ 9 ఓవర్లలో 78 పరుగులతో భారత్‌కు భారీ స్కోరును అందించారు.