ఇండోర్‌లోని మహారాణి ఉషారాజే ట్రస్టు క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న భారత్- ఇంగ్లండ్ రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల పతనానికి 292 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ బౌలర్లు ప్రారంభంలో కీలక వికెట్లు పడగొట్టి పట్టుసాధించినట్టు కనిపించారు. అయితే యువరాజ్ సింగ్, గంభీర్, చివర్లో యూసఫ్ పఠాన్ (50) రాణించడంతో టీం ఇండియా ఈ మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్ ముందు భారీ విజయలక్ష్యాన్ని ఉంచగలిగింది.
యువరాజ్ సింగ్ (118) ఈ మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించాడు. 122 బంతుల్లో 15 ఫోర్లు, రెండు సిక్స్‌లతో వన్డేల్లో పదో సెంచరీ పూర్తి చేసుకున్న యువీ చివరి ఓవర్లలో బ్రాడ్ బౌలింగ్‌లో కీపర్ ప్రియర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అంతకుముందు ఓపెనర్ గౌతం గంభీర్ అర్థసెంచరీ (76 పరుగులు) చేసి, పీటర్సన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (1), రైనా (4) పటేల్, రోహిత్ శర్మ (3), మహేంద్ర సింగ్ ధోనీ (15) విఫలం అయ్యారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో... బ్రాడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, హార్మిసన్, కాలింగ్‌వుడ్, పీటర్సన్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.