కాన్పూర్ వన్డే: ఇంగ్లాండ్‌ను కట్టడి చేసిన స్పిన్నర్లు

భారత్ - ఇంగ్లాండ్‌ జట్ల మధ్య కాన్పూర్‌లో జరుగుతున్న మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ నింపాదిగా బ్యాటింగ్ చేస్తోంది. బ్యాటింగ్ పిచ్‌పై ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్స్‌ పరుగులు రాబట్టకుండా భారత స్పిన్నర్లు కట్టడి చేశారు.

హర్భజన్ సింగ్, యువరాజ్‌ సింగ్‌లు తమ స్లో బంతులతో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్స్‌ను ముప్పతిప్పలు పెట్టారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన బొపరా (53) అర్థ సెంచరీ చేయగా, బెల్ (46) అర్థ సెంచరీని చేజార్చుకుని మునాఫ్ పటేల్ బౌలింగ్‌లో పెవిలియన్ ముఖం పట్టాడు.

బెల్ స్థానంలో మైదానంలోకి వచ్చిన ఇంగ్లాండ్ కెప్టెన్ పీటర్సన్ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భజ్జీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అదే విధంగా కాలింగ్‌వుడ్ కేవలం ఒక పరుగు మాత్రమే సాధించి భజ్జీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్‌లో ఫ్లింటాఫ్ (5), బొపారా (53)లు ఆడుతున్నారు. దీంతో 33 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.

వెబ్దునియా పై చదవండి