ఢిల్లీ టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. భారత్ 613 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసిన తర్వాత ఆస్ట్రేలియా తరపున తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హెడెన్ (16), కటిచ్ (29)లు రెండో రోజు ఆట ముగిసే సమయానికి అజేయంగా నిలిచారు.
దీంతో ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 50 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 613 పరుగుల వద్ద డిక్లెర్ చేసిన సంగతి తెలిసిందే. ఓపెనర్ గౌతం గంభీర్ (206), వీవీఎస్ లక్ష్మణ్ (200)లు డబుల్ సెంచరీలతో విరుచుకుపడడంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించగల్గింది.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో గంభీర్, లక్ష్మణ్ తర్వాత సచిన్ (68), కుంబ్లే (45)లు రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాన్సన్ మూడు వికెట్లు సాధించగా వాట్సన్ రెండు వికెట్లు సాధించాడు. వీరితోపాటు బ్రెట్‌లీ, కటిచ్‌లు చెరో వికెట్ సాధించారు.