ఢిల్లీ టెస్ట్: గంభీర్ డబుల్ సెంచరీ

ఢిల్లీ టెస్టులో భారత బ్యాట్స్‌మెన్స్ వీర విహారం చేస్తున్నారు. మూడో టెస్ట్ రెండో రోజు ఉదయం ప్రారంభమైన కొద్ది సేపటికే హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్.లక్ష్మణ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత లంచ్ ముగించుకుని వచ్చిన తర్వాత ఓపెనర్ గంభీర్ తన కెరీర్‌లోనే తొలి డబుల్ సెంచరీ కొట్టాడు. దీంతో భారత్ మూడు వికెట్ల నష్టానికి 426 పరుగులతో పటిష్టస్థితిలో కొనసాగుతోంది.

అంతకుముందు.. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ తొలి ఓవర్ నైట్ స్కోరు 296తో రెండో రోజు (గురువారం) ఆటను ప్రారంభించింది. ఆరంభంలో ఆచితూచి ఆడిన భారత్ బ్యాట్స్‌మెన్స్ కాస్త నిలదొక్కుకున్న తర్వాత ఆసీస్ బౌలర్ల భరతం పట్టారు. గంభీర్-లక్ష్మణ్ జోడీని విడదీసేందుకు ఆసీస్ కెప్టెన్ వేయని ఎత్తులు లేవు, ప్రయోగించిన బౌలర్ లేడు.

చివరకు తాను కూడా బౌలింగ్‌కు దిగినా ఫలితం లేకుండా పోయింది. గంభీర్ 375 బంతుల్లో 25 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో తొలి డబుల్ సెంచరీ చేశాడు. అంతకుముందు లక్ష్మణ్ 171 బంతుల్లో వంద పరులుగు పూర్తి చేసిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి