హీరో హోండా కప్ సిరీస్‌లో భాగంగా బుధవారం నాగ్‌పూర్ డే అండ్ నైట్ వన్డే మ్యాచ్‌లో పర్యాటక ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి సెషన్‌లో నాగ్‌పూర్ పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తుందని గ్రహించిన రికీ పాంటింగ్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెల్సిందే.