బౌలర్ల ధాటికి తడబడుతున్న ఆసీస్

నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియా భారత్‌కు ధీటుగానే ఆడుతోంది. అయితే తాజా వివరాల ప్రకారం భారత బౌలర్ల ధాటికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది.

శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 189 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో బరిలోకి దిగింది. ఆసీస్ ఓపెనర్ సైమన్ కాటిచ్ సెంచరీ పూర్తి చేశాడు.

కాటిచ్ 102 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జహీర్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యూ అయ్యాడు. కాటిచ్ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన క్లార్క్ 8 పరుగులకే ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చాడు. క్లార్క్ తర్వాత బరిలోకి దిగిన వాట్సన్‌ను కేవలం రెండు పరుగుల వద్దే భజ్జీ వికెట్‌తో పడగొట్టాడు.

అదే విధంగా ఆసీస్ జట్టు సారధి రిక్కీ పాంటింగ్‌‌ కూడా కేవలం 24 పరుగుల వద్దే హర్భజన్ సింగ్ చేతిలో అవుటయ్యాడు. ప్రస్తుతం హెడ్డెన్, వైట్‌‌లు క్రీజులో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి