రాజ్‌కోట్ వన్డే: ఇంగ్లండ్‌కు ఎదురెబ్బ

రాజ్‌కోట్‌లో జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ తొలి వన్డేలో భారత్ నిర్దేశించిన 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లండ్ బరిలోకి దిగింది. అయితే భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ప్రయర్‌ నాలుగు పరుగుల వద్దే మునాఫ్ పటేల్ బౌలింగ్‌లో సెహ్వాగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

అదే విధంగా ఒ.ఎ. షాను కేవలం ఒక పరుగు కూడా చేయనివ్వకుండానే సెహ్వాగ్ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఐఆర్ బెల్ 19 పరుగులతో, కె.పి పీటర్సన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. దీనితో ఇంగ్లండ్ 7.3 ఓవర్లలో రెండు వికెట్ల పతనానికి 26 పరుగులను మాత్రమే చేసింది.

అంతకుముందు ఆడిన భారత్... ఆటగాళ్ల ఫోర్ల, సిక్సర్ల మోతతో 387 పరుగుల భారీ స్కోరును నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి