రాజ్‌కోట్ వన్డే: రెండు వికెట్లు కోల్పోయిన భారత్

రాజ్‌కోట్‌లో భారత్-ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో తాజాగా భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు సెహ్వాగ్, గౌతం గంభీర్‌లు తమ భాగస్వామ్యంతో భారత్‌కు 136 పరుగులు సంపాధించి పెట్టారు. అయితే వీరేంద్ర సెహ్వాగ్ 85 పరుగుల వద్ద ఇంగ్లండ్ బౌలర్ పటేల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

అదే విధంగా గౌతం గంభీర్ కూడా అర్థశతకంతోనే సరిపెట్టుకున్నాడు. గౌతం గంభీర్‌ను పటేల్ వికెట్‌తో పడగొట్టాడు. ప్రస్తుతం ఎస్.కె. రైనా (27 పరుగులు), యువరాజ్ సింగ్‌ (28 పరుగులు)తో క్రీజులో ఉన్నారు. వీరిలో యువరాజ్ సింగ్ మూడు ఫోర్లు సాధించాడు. దీనితో భారత్ ప్రస్తుతానికి 33 ఓవర్లలో 213 పరుగులు సాధించింది.

వెబ్దునియా పై చదవండి