నాటింగ్ హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. ఆ జట్టులో హఫీజ్ 84, అజామ్ 63, సర్ఫరాజ్ 55 చొప్పున పరుగులు చేయడంతో పాక్ జట్టు భారీ స్కోరు చేసింది.
ఆ తర్వాత భారీ లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన ఇంగ్ండ్ జట్టు.... 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 334 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లండ్ ఆటగాళ్లళో రూట్ (107) - బట్లర్ (103)లు సెంచరీలతో కదం తొక్కినప్పటికీ జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేక పోయారు. ఫలితంగా వరల్డ్ ఫేవరేట్‌గా ఉన్న ఇంగ్లండ్‌కు పాకిస్థాన్ రూపంలో పంచ్ పడింది.