అవును ఒక మ్యాచ్ సమీకరణాలనే మార్చేసింది. టీమిండియా పైకి, ఆస్ట్రేలియా రెండో స్థానానికి చేరుకుంది. ప్రపంచకప్ మెగా ఈవెంట్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో శనివారం జరిగిన తన చిట్టచివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాపై విజయం సాంధించింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించింది. ఇంకా ఆస్ట్రేలియాపై పది పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు.. 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 325 పరుగులను చేసింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా టీమ్ ఆద్యంతం పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో 49.5 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ పరాజయంతో ఆస్ట్రేలియా జట్టు.. పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి దిగజారింది.
భారత్, ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. మూడు, నాలుగు స్థానాల్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ కొనసాగుతున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకిన టీమిండియా తన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును ఢీ కొట్టబోతోంది. ఈ మ్యాచ్ ఈ నెల 9వ తేదీన జరుగనుంది.