మాంచెస్టర్ సెమీఫైనల్.. ఐదు పరుగులకు మూడు వికెట్లు.. టీమిండియాకు షాక్

బుధవారం, 10 జులై 2019 (16:07 IST)
మాంచెస్టర్ వేదికగా భారత్-కివీస్‌ల మధ్య జరుగుతున్న తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ జ‌ట్టు భార‌త్‌కు 240 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. మొత్తం 50 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల‌ను కోల్పోయిన న్యూజిలాండ్ 239 ప‌రుగులు చేసింది‌. రెండో రోజు మ్యాచ్ ఆరంభంలోనే న్యూజిలాండ్ జ‌ట్టు రెండు వికెట్ల‌ను కోల్పోయింది. 48వ ఓవ‌ర్ చివ‌రి బంతికి రాస్ టేల‌ర్ ర‌నౌట్ అయ్యాడు. 
 
బుమ్రా బంతిని డీప్ స్క్వేర్‌లెగ్ వైపు ఆడాడు రాస్ టేల‌ర్‌. ఒక ర‌న్ పూర్తి చేశాడు. ఇంకో ర‌న్ కోసం ప్ర‌య‌త్నించాడు. ఇంకో ఎండ్‌లో ఉన్న టామ్ లాథ‌మ్ పిలుపు అందుకున్న టేల‌ర్‌.. రెండో ర‌న్ కోసం ప‌రుగెత్తాడు. ఆ లోపే డీప్ స్క్వేర్‌లెగ్‌లో ఫీల్డింగ్‌లో ఉన్న ర‌వీంద్ర జ‌డేజా అద్భుతం చేశాడు. వికెట్ కీప‌ర్ వైపు బంతిని త్రో చేశాడు. నేరుగా వికెట్ల‌ను తాకిందా బంతి. అంతే. ఇంకో ఛాన్సే లేకుండా, రాస్ టేల‌ర్ పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు.
 
అసంపూర్తిగా ముగిసిన 47వ ఓవ‌ర్‌లో ఎనిమిది ప‌రుగుల‌ను రాబ‌ట్టుకున్నారు. 48వ ఓవ‌ర్‌లో ఎనిమిది ప‌రుగులు చేశారు. చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో ఏడు ప‌రుగులు చొప్పున సాధించారు. ఈ క్ర‌మంలో మూడు వికెట్ల‌ను కోల్పోయింది న్యూజిలాండ్‌. మొత్తం 50 ఓవ‌ర్ల‌లో ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 239 ప‌రుగుల‌ను చేసింది. టీమిండియా ముందు 240 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.
 
ఆపై బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే గట్టిదెబ్బ తగిలింది. టీమిండియా రోహిత్‌ తొలి వికెట్ కోల్పోయింది. మాట్‌ హెన్రీ వేసిన 1.3వ బంతి ఆడిన రోహిత్‌ శర్మ (1; 4 బంతుల్లో) కీపర్‌ టామ్‌ లేథమ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఇక రెండు ఓవర్లకు భారత్‌ 5/1 సాధించింది. హెన్రీ మూడు పరుగులిచ్చి వికెట్‌ తీశాడు. కాసేపట్లో టీమిండియాకు రెండో షాక్ తప్పలేదు. 
 
టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ (1; 6 వికెట్లు) ఔటయ్యాడు. బౌల్ట్‌ వేసిన 2.4వ బంతి ఆడే క్రమంలో వికెట్ల ముందు దొరికిపోయాడు. సమీక్ష కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో భారత్‌కు గట్టిదెబ్బ తగిలింది. దీంతో నాలుగు ఓవర్లకు ఐదు పరుగులు సాధించిన టీమిండియా కీలక మూడు వికెట్లను కోల్పోయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు