పాకిస్తాన్ సెమీస్ ఆశలు సమాధి కాలేదు... ఆ 4 జరిగితే అంటున్న 'ఆవలింత' సర్ఫ్‌రాజ్

గురువారం, 4 జులై 2019 (21:09 IST)
పాకిస్తాన్ జట్టు సెమీస్ ప్రవేశంపై గంపెడాశలు పెట్టుకుంది. ఎలాగైనా ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ప్రవేశించాలని ప్రార్థనలు చేసుకుంటోంది. దాంతో ఈ జట్టు ఆశలు అంతా అనుకున్నట్లుగా సమాధి కాలేదు. ఏదో అద్భుతం చేసైనా సెమీ ఫైనల్లోకి వస్తాం అన్న ధీమాతో వుంది. శుక్రవారం పాకిస్తాన్ తన చివరి లీగ్ మ్యాచ్ బంగ్లాదేశ్ జట్టుపై ఆడబోతోంది.
 
ఈ జట్టుతో ఆడే క్రమంలో పాకిస్తాన్ జట్టు సెమీస్ లోకి అడుగుపెట్టాలంటే ఈ క్రిందివన్నీ జరగాలి. మరి అవేంటో చూద్దాం.
1. తొలుత పాకిస్తాన్ జట్టే టాస్ గెలవాలి.
2. పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోవాలి.
3. 50 ఓవర్లలో 400 పరుగులు చేయాలి.
4. బంగ్లాదేశ్ జట్టుని 50 ఓవర్లలో 88 పరుగులకే ఔట్ చేయాలి.
 
పైన చెప్పుకున్నవి నాలుగూ జరిగితే పాకిస్తాన్ జట్టు సెమీ ఫైనల్లోకి వెళ్తుంది. ఈ లెక్కన ఇటు సూర్యుడు అటు పొడిస్తే ఏమైనా సాధ్యమవుతుందేమోనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కానీ సర్ఫరాజ్ ఎప్పటిలాగే ఆవలిస్తూ... రేపు మనం సెమీ ఫైనల్లోకి వెళ్లబోతున్నాం అంటున్నారట. చూద్దాం... సర్ఫరాజ్ స్టామినా ఏంటో?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు