''మాకు కాశ్మీర్ వద్దు.. విరాట్ కోహ్లీని మాకిచ్చేయండి''.. పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్

బుధవారం, 19 జూన్ 2019 (13:21 IST)
భారత్-పాకిస్థాన్‌ల మధ్య సుదీర్ఘకాలంగా జమ్మూ-కాశ్మీర్ అంశం కొరకరాని కొయ్యగా మారింది. కాశ్మీర్ కోసం ఇరుదేశాల మధ్య నువ్వానేనా అనే పోరాటం జరుగుతోంది. ఇందుకోసం సరిహద్దుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పాకిస్థాన్-భారత్ సైన్యాల మధ్య బాలికాట్, పఠాన్ కోట్ దాడులు జరిగాయి.


ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ మాకొద్దని.. పాకిస్థాన్ మొండికేస్తున్నారు. ఇదేంటి అనుకుంటున్నారు కదూ.. అయితే చదవండి. జమ్మూకాశ్మీర్ మాకొద్దని.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మాకిచ్చేయండి అంటూ పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
 
ఎందుకంటే ఆదివారం క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. పాకిస్తాన్ ఓడిపోవడాన్ని పాకిస్థాన్ ఫ్యాన్ల్ జీర్ణించుకోలక పోతున్నారు. పాకిస్థాన్ జట్టును ఏకిపారేసిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఇలాంటి ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో కొందరు పాకిస్తాన్ జెండాతో బ్యానర్ పట్టుకుని నిలబడి వున్నారు. 
 
ఈ బ్యానర్‌లో ''మాకు కాశ్మీర్ వద్దు.. విరాట్ కోహ్లీకి మాకిచ్చేయండి'' అంటూ స్లోగన్ వుంది. ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయిన తర్వాత పాక్ ఫ్యాన్స్.. తమకు కాశ్మీర్ కావాల్సిన అవసరం లేదని.. కోహ్లీని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వున్నారు.
 
అయితే ఈ ఫోటో ఫేక్ అని తెలుస్తోంది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఈ చిత్రాన్ని కనుగొన్నప్పుడు, ఆగస్టు 8, 2016న ''ఇండియా టుడే'' వార్త వచ్చింది. ఈ వార్తలలో వైరల్ అయిన ఈ చిత్రంలోని బ్యానర్‌లో WE WANT AZADAI అనేది శీర్షిక కనిపిస్తోంది. అసలు ఛాయాచిత్రంలో స్వతంత్ర డిమాండ్ బ్యానర్ ఉందని స్పష్టమైంది. 
 
2016లో, కాశ్మీర్లోని హిస్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనిని భద్రతా దళాలు హతమార్చారు. ఇందుకు నిరసనగా కాశ్మీర్‌లో విధ్వంసం చోటుచేసుకుంది.

కాశ్మీర్‌లో జరిగిన నిరసన సందర్భంగా, కాశ్మీరీ యువత బ్యానర్లు, పాకిస్తాన్ జెండాతో, భద్రతా దళాల చేతిలో బుర్హాన్ వాని మరణానికి నిరసనగా "మాకు స్వేచ్ఛ అవసరం" అని రాశారు. ప్రస్తుతం ఇదే బ్యానర్‌లో కోహ్లీ కావాలని అడుగుతున్నట్లు గల ఫోటో వైరల్ అయ్యింది. అంతేగాకుండా.. ఈ ఫోటో ఫేక్ అని తేలింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు