ప్రపంచ కప్ 2019... పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ఎక్కడుందో తెలుసా?

శనివారం, 8 జూన్ 2019 (17:58 IST)
క్రికెట్ క్రీడాభిమానులకు ప్రపంచ కప్ పోటీలు వస్తే పండుగే. అది కూడా భారతదేశం పరిస్థితి ఎలా వుందన్నది తెలుసుకోవడంతో పాటు ఆ తర్వాత అత్యంత ఆసక్తిగా చూసేది పాకిస్తాన్ జట్టు గురించే. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కనిపిస్తోంది. భారత జట్టు ఆడిన ఒక్క మ్యాచ్ లోనూ విజయం సాధించి 2 పాయింట్లతో వుంది.
 
జట్టు ఒక్కో విజయానికి రెండేసి పాయింట్లు వస్తాయి. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు జట్ల మధ్య సెమీ ఫైనల్స్ పోరు జరుగుతుంది. ఇక టోర్నమెంట్ బహుమతుల వివరాలను పరిశీలిస్తే... ప్రపంచకప్ 2019 గెలుచుకున్న జట్టుకు రూ. 28.04 కోట్లను బహుమతిగా ఇస్తారు. రన్నరప్ జట్టుకి రూ. 14.02 కోట్లు, సెమీఫైనల్సులో ఓడిన జట్లకు చెరో రూ. 5.6 కోట్లు ఇస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు