ముంబైలోని విలేపార్లేలో నివాసముంటుంటోంది కేథరిన్. ప్రముఖ కాల్ సెంటర్లో ఆమె పనిచేస్తోంది. కాల్ సెంటర్లో పనిచేస్తోన్న కరోల్ మిస్కిట్టా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త సహజీవనం వరకు వెళ్ళింది. తండ్రి అప్పటికే అనారోగ్యంతో చనిపోవడంతో కేథరిన్ ఆడిందే ఆట..పాడిందే పాటలా తయారైంది.
దీంతో కొన్ని సంవత్సరాల పాటు కరోల్ మిస్కిట్టాతో సహజీవనం చేసింది. పెళ్ళి కాకుండానే కలిసి ఉంది. కాల్ సెంటర్‌కు ఒక కొత్త యువకుడు వచ్చాడు. అతను కరోల్ స్నేహితుడు. అతని ద్వారా కేథరిన్‌కు దగ్గరయ్యాడు సంజయ్. ఆమెకి మాయ మాయటలు చెప్పి, మభ్యపెట్టి లొంగదీసుకున్నాడు.