వచ్చేస్తున్నా భగవంతుడా అంటూ భవనం పైనుంచి దూకేశాడు (video)

ఐవీఆర్

మంగళవారం, 22 ఏప్రియల్ 2025 (15:17 IST)
ప్రకాశం జిల్లా గిద్దలూరులో విషాదకర సంఘటన జరిగింది. తనను దేవుడు రమ్మని పిలుస్తున్నాడంటూ ఓ వృద్ధుడు ఆసుపత్రి భవనం పైనుంచి కిందికి దూకేశాడు. దీనితో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఈ వృద్ధుడు గాయపడ్డాడు. దీనితో అతడిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఐతే వున్నట్లుండి తనను దేవుడు పిలుస్తున్నాడంటూ తోటి రోగులతో చెప్పడం ప్రారంభించాడు. వాళ్లు అతడు చెప్పే మాటలను ఆసుపత్రి సిబ్బందికి తెలియజేసేలోపుగానే... వచ్చేస్తున్నా భగవంతుడా అంటూ ఆసుపత్రి భవనం పైనుంచి కిందికి దూకేశాడు. ఇదంతా సీసీ కెమేరాలో రికార్డయ్యింది.

దేవుడు పిలిచాడని ఆసుపత్రి బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్

ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఘటన. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధుడు.
తనని దేవుడు పిలుస్తున్నాడని తోటి రోగులతో చెప్పిన వృద్ధుడు. కాసేపటికే ఆసుపత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య. pic.twitter.com/7pPAYOCEOB

— ChotaNews App (@ChotaNewsApp) April 22, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు