అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

ఐవీఆర్

శనివారం, 12 ఏప్రియల్ 2025 (16:13 IST)
అయోధ్య బాలరాముడుని దర్శించుకునేందుకు వచ్చిన కొందరు మహిళా భక్తులు స్నానం చేస్తుండగా వారిని వీడియో తీసాడు ఓ కామాంధుడు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అతిథిగృహంలో గదులను బుక్ చేసుకోగా, ఆ గదులకు ఆనుకుని నిర్మించిన బాత్రూంల పైకప్పు ఎక్కి వాటి నుంచి వీడియో తీస్తున్నాడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. శుక్రవారం నాడు వారణాసి నుంచి ఐదుగురు మహిళలు అయోధ్య వచ్చారు. వీరిలో ఓ మహిళ ఉదయం 6 గంటలకు స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లింది. అక్కడ ఆమె స్నానం చేస్తున్న సమయంలో బాత్రూం పైకప్పు పైన మనిషికి సంబంధించి నీడ వుండటాన్ని గమనించింది. మరింత నిశితంగా ఆమె పరిశీలించగా పైనున్న వ్యక్తి తన మొబైల్ ఫోను ద్వారా తనను వీడియో తీస్తున్నట్లు గుర్తించి వెంటనే కేకలు వేసింది. దీనితో చుట్టుపక్కల వున్న ఇతర భక్తులు కూడా అక్కడికి చేరుకున్నారు.
 
బాత్రూం పైన వున్న కామాంధుడుని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడి మొబైల్ ఫోన్ తనిఖీ చేయగా అందులో పలువురు మహిళలు స్నానం చేస్తున్న వీడియోలతో పాటు ఫోటోలు కూడా కనిపించాయి. వెంటనే సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అయోధ్య రామాలయం 3వ గేటు సమీపంలో వున్న రాజా గెస్ట్ హౌసులో ఇతడు ఇలాంటి పాడు పనులు చేస్తున్నట్లు గుర్తించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు