తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎలాగంటే?

ఠాగూర్

బుధవారం, 26 మార్చి 2025 (15:25 IST)
బెంగుళూరు నగర శివారు ప్రాంతంలో జరిగిన ఓ రియల్టర్ హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కన్నతల్లి సాయంతోనే కట్టుకున్న భర్తను భార్య హత్య చేసింది. మత్తుమందు కలిపిన ఆహారాన్ని భర్తకు భార్య తినిపిస్తే, అత్త మాత్రం కత్తితో అల్లుడు మెడపై రెండు కత్తిపోట్లు పొడిచింది. భర్త పెట్టే వేధింపులు భరించలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రామనగర జిల్లాకు చెందిన లోక్‌నాథ్ సింగ్ పలు మోసాలకు పాల్పడే వ్యక్తి. అయితే, గత నాలుగు నెలల క్రితం యశస్వి (19) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొద్ది రోజులకే లోక్‌నాథ్ నిజస్వరూపం బయటపడింది. ఎపుడైనా తన శారీరక కోరిక తీర్చేందుకు నిరాకరిస్తే ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు. పైగా, అత్త హేమాబాయి (37)తోనూ అక్రమ సంబంధం పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. 
 
తనతో గడిపేలా నీ తల్లిని ఒప్పించు అంటూ భార్యను వేధించసాగాడు. దీంతో విసిగిపోయిన యశస్వి.. భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అయినప్పటికీ అతడి వేధింపులు మాత్రం ఆగలేదు. అత్తగారింటికి వచ్చి నానా రభస చేయసాగాడు. తన భార్యను తనతో పంపించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. దీంతో విసిగిపోయిన తల్లీకుమార్తెలు లోక్‌నాథ్‌ను హత్య చేయాలని ప్లాన్ చేశారు. 
 
తమ పథకాన్ని అమలు చేసేందుకు సరైన అవకాశం కోసం ఎదురు చూడసాగారు. ఈ క్రమంలో శనివారం ఉదయం లోక్‌నాథ్ భార్యకు ఫోన్ చేసి కలుస్తానని చెప్పాడు. తన సోదరికి మాత్రం బెంగుళూరు వెళుతున్నట్టు చెప్పి ఉదయం 10 గంటలకు కారులో భార్య వద్దకు వెళ్లాడు. యశస్విని, హేమబాయిలు భోజనం తయారు చేసి అందులో నిద్రమాత్రలు కలిపారు. లోక్‌నాథ్ కూడా పార్టీ చేసుకుందామని బీరు బాటిళ్లను కూడా తన వెంట కారులో తీసుకొచ్చాడు. 
 
ఆ తర్వాత యశస్వినితో కలిసి బీజీఎస్ లేఔట్‌లోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. కారులో లోక్‌నాథ్ బీరు తాగుతుండగా, యశస్విని మాత్రం నిద్రమాత్రలు కలిపిన ఆహారాన్ని భర్తకు తినిపించింది. అదేసమయంలో తాము ఉన్న లొకేషన్‌ను తల్లికి షేర్ చేయగా, ఆమె కూడా అక్కడకు చేరుకుంది. అప్పటికే మత్తు ఎక్కువ కావడంతో నిద్రలోకి జారుకున్న లోక్‌నాథ్ మెడపై కత్తితో రెండుసార్లు పొడిచింది. 
 
దీంతో తీవ్రంగా గాయపడిన లోక్‌నాథ్ కారు దిగి కొంతదూరం పరుగెత్తి ఆటోలో దాక్కునే ప్రయత్నం చేశాడు. అతని అరుపులు ఆలకించిన స్థానికులు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం చేరవేశారు. అయితే, పోలీసులు వచ్చేలోపు లోక్‌నాథ్ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, ఈ హత్య చేసింది తల్లీ కుమార్తెలని తేల్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు