జంట హత్యలకు దారితీసిన అక్రమ సంబంధం... ఎక్కడ?

ఠాగూర్

గురువారం, 16 జనవరి 2025 (13:42 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన జంట హత్య కేసుల్లో మిస్టరీ వీడింది. ఈ రెండు హత్యలకు అక్రమ సంబంధమే కారణమని తేలింది. ముగ్గురు పిల్లల తల్లితో ఇద్దరు వ్యక్తులు ఒకరికి తెలియకుండా ఒకరు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఇదే ఇద్దరి ప్రాణాలకు ముప్పుగా మారింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ జంట హత్య కేసుల్లోని మిస్టరీని పరిశీలిస్తే, 
 
చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బిందు, దివాకర్ దంపతులు శంకరపల్లిలో ఉండేవారు. వీరికి ముగ్గురు పిల్లలు. దివాకర్ ప్లంబర్ పనిచేస్తుండగా, ఆ సమయంలో అక్కడ హౌస్ కీపింగ్ చేసే సాకేత్ అనే వ్యక్తితో బిందుకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ విషయం తెలుసుకున్న దివాకర్ తన భార్యను హెచ్చరించి, తన కుటుంబాన్ని వనస్థలిపురంలోని చింతల్ కుంటకు మార్చాడు. కొన్ని రోజుల క్రితం బిందు, సాకేత్ ఇద్దరూ మాయమయ్యారు. దీంతో దివాకర్ ఈ నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడు రోజుల తర్వాత సాకేత్ కనిపించడం లేదంటూ ఆయన సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ నెల 14న పుప్పాలగూడ అనంత పద్మనాభస్వామి గుట్టల్లో రెండు మృతదేహాలను గుర్తించారు. వీరిద్దరినీ దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. 11వ తేదీనే వీరు హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
 
బిందుతో సాకేత్ వ్యభిచారం చేయిస్తున్న విషయం బయటపడింది. ఈ నెల 8న వనస్థలిపురం వెళ్లిన సాకేత్ బైకుపై బిందును తీసుకుని నానక్ రామ్ గూడ వెళ్లాడు. అక్కడ మిత్రుడి గదిలో మూడు రోజులు ఉన్నారు. 11వ తేదీన ఫోన్‌కాల్ రావడంతో బిందుతో కలిసి అనంత పద్మనాభస్వామి గుట్టల వద్దకు చేరుకున్నాడు. అక్కడ నలుగురు ఐదుగురితో కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో అక్కడ గొడవ జరిగింది. సాకేత్‌ను వారు కత్తితో పొడవడంతో భయపడిన బిందు పారిపోయే ప్రయత్నంలో హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే, బిందుతో అక్రమ సంబంధం పెట్టుకున్న మరో వ్యక్తి ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు