లైంకిగదాడికి పాల్పడిన వైద్యుడు.. సర్జికల్ బ్లేడుతో దాన్ని కట్ చేసిన నర్సు.. ఎక్కడ?

ఠాగూర్

ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (10:29 IST)
కోల్‌కతా మెడికో హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఈ కేసులోని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వైద్యులు నిరవధికంగా ఆందోళన చేస్తున్నారు. ఇదిలావుంటే, బీహార్ రాష్ట్రంలో ఓ వైద్యుడు.. ఆస్పత్రిలో నర్సుపై లైంగికదాడికి యత్నించాడు. అయితే, బాధితరాలు ఆ లైంగికదాడి నుంచి తప్పించుకోవడంతో పాటు.. ప్రతిఘటించి సర్జికల్ బ్లేడుతో వైద్యుడి జననాంగాన్ని కోసిపారేసింది. ఆ తర్వాత జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లా గంగాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఒక యేడాదిగా ఓ నర్సు పని చేస్తోంది. బుధవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికెళ్తుండగా.. ఆస్పత్రి నిర్వాహకుడైన డాక్టర్ సంజయ్ కుమార్ సంజు, తన సహచరులు సునీల్ కుమార్ గుప్తా, అవధేశ్ కుమార్‌తో కలసి ఆమెను అడ్డగించాడు. అప్పటికే పూటుగా మద్యం సేవించిన వారు నర్సును వేధించసాగారు. ఈనేపథ్యంలోనే సంజయ్ ఆమెను పక్కకు లాక్కెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. తీవ్రంగా ప్రతిఘటించిన ఆమె.. చేతికి దొరికిన సర్జికల్ బ్లేడుతో అతడి మర్మాంగంపై దాడి చేసి పరిగెత్తగా.. సునీల్, అవధేశ్ ఆమెను వెంబడించారు. 
 
ఓ చోట దాక్కొని ఎమర్జెన్సీ నంబర్ 112కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. గాయపడిన వైద్యుడికి ఓ ఆస్పత్రిలో గోప్యంగా చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సర్జికల్ బ్లేడ్, రక్తంతో తడిసిన బెడ్ షీట్లతో పాటు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అత్యాచారయత్నానికి ముందే ఆస్పత్రిలోని సీసీ కెమెరాలను నిందితులు ఆఫ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు