ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. మరో వ్యక్తితో ఫోనులో చాటింగ్ చేస్తుందని భావించిన ఓ వ్యక్తి తల్లితో పాటు ఆమె కుమార్తెను కూడా హత్య చేశాడు. ఈ దారుణం రాజమండ్రి హక్కంపేట డి బ్లాకులో చోటుచేసుకుంది. మృతులను ఎండీ సల్మాన్ (38), ఆమె కుమార్తె ఎండీ సానియా (16)లుగా గుర్తించారు. ఈ హత్యల తర్వాత నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
ఈ విషయంపై ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. చిన్నచిన్న మాటలతో మొదలైన గొడవ తీవ్రస్థాయికి చేరుకుని చివరకు హత్యకు దారితీసింది. తల్లిని, కుమార్తెను హత్య చేసిన శివకుమార్ అక్కడ నుంచి నేరుగా ఠాణాకు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.