టాలీవుడ్ ప్రముఖ నటి రజిత అందరికి తెలుసు. శుక్రవారం మధ్యాహ్నం రజిత అమ్మగారు విజయలక్ష్మీ (76) గారు గుండెపోటుతో మరణించారు. క్యారెక్టర్ నటులు కృష్ణవేణి, రాగిణిలు విజయలక్ష్మీకి చెల్లెళ్లు. విజయలక్ష్మీ మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియచేశారు. ఈ సమయంలో రజిత ధైర్యంగా ఉండాలని ఆమెకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.