తొమ్మిదో తరగతి విద్యార్థినిపై విద్యార్థి లైంగిక వేధింపులు.. తండ్రి అత్యాచారం...

సోమవారం, 10 ఏప్రియల్ 2023 (13:35 IST)
సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఒకటి జరిగింది. తొమ్మిదో తరగతి చదివే ఓ 15 యేళ్ల బాలికపై సహచర విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడగా, ఆ విద్యార్థి తండ్రి ఏకంగా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిత్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఈ నెల 13వ సదరు విద్యార్థిని తోటి విద్యార్థి (18) స్కూలు నుంచి తన ఇంటికి తీసుకెళ్లాడు. పరీక్షకు సంబంధించి డాక్యుమెంట్ ఫోటో కాపీ ఇస్తానని మభ్యపెట్టి తీసుకెళ్లాడు. ఇంట్లో ఆమెపై లైగిక దాడి చేయబోయాడు. సాయం కోసం బాలిక కేకలు పెట్టింది. ఆ అరుపులు ఆలకించిన బాలుడి తండ్రి... అక్కడకు చేరుకుని తన కుమారుడిపై కేకలు వేసి.. అక్కడ నుంచి బయటకు పంపించివేశాడు. 
 
ఆ తర్వాత కండువాతో ఆమెను బంధించి అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. అయితే, తండ్రీ కొడుకులు చేసిన పాడుపనిని జీర్ణించుకోలేక తన తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు కేసు నమోదు చేయలేదు. దీంతో  బాధితురాలు కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు