ఇన్‌స్టాగ్రామ్‌లో లైకుల పోటీ కారణంగా ఇద్దరు హత్యకు గురయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు వచ్చిన లైకులు, కామెంట్స్‌పై జరిగిన వాదన ఈ జంట హత్యలకు దారితీశాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఈ విచారణలో మృతులను సాహిల్, నిఖిల్ అనే వారిగా గుర్తించారు. పైగా, ఈ కేసులో ఓ బాలికతో పాటు ఆమె మైనర్ సోదరుడుతో సహా మొత్తం నలుగురికి సంబంధం ఉన్నట్టు గుర్తించి వారిని అరెస్టు చేశారు. అలాగే, జంట హత్యల కోసం వినియోగించిన ఇద్దరు ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వ్యాఖ్యపై ఓ యువతికి నిఖిల్‌కు మధ్య గొడవ జరిగింది. ఆన్‌లైన్ కాదు వీధిలోకి వచ్చి మీ ధైర్యాన్ని చూపండి అంటూ సవాల్ విసిరింది. దీంతో నిఖిల్ సాహిల్‌తో కలిసి అర్థరాత్రి సమయంలో ఆ యువతి ఉండే ప్రాంతానికి వచ్చాడు. ఈ విషయం బాలికకు చేరవేయగా, ఆమెతన పాటు మరికొందరిని పిలుచుకుని వచ్చి 26 యేళ్ల నిఖిల్, 19 యేళ్ల సాహిల్‌లను చంపేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఈ జంట హత్య కేసులతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు.