ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న వృద్ధురాలు

బుధవారం, 4 జనవరి 2023 (15:01 IST)
హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మెట్రో రైల్వే స్టేషన్ పైనుంచి ఓ వృద్దురాలు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెను మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన మారెమ్మ (70)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు., 
 
ఈ ఘటన బుధవారం జరిగింది. ఈ మెట్రో స్టేషన్‌లోకి సాటి ప్రయాణికులతో పాటు ప్రవేశించిన వృద్ధురాలు ఆకస్మికంగా కిందికు దూకేసింది. పైనుంచి దూకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం ఎక్కువగా కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తోటి ప్రయాణికులు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. మారెమ్మ ఆత్మహత్య విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టు సనత్ నగర్ పోలీసులకు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు