ద్వారకాపురి కాలనీలో షాపు ముందు ఐదేళ్ల బాలిక మృతదేహం

గురువారం, 4 నవంబరు 2021 (15:41 IST)
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకపురి కాలనీలో దారుణం సంభవించింది. ఓ షాప్ ముందు నాలుగేళ్ల బాలిక మృతదేహం కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. 
 
వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలికను ఎక్కడో చంపేసి ఇక్కడ పడేశారా..? ఎవరు చేశారు..? అత్యాచారం ఏమన్నా జరిగిందా..? లాంటి పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు