మరోవైపు, ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డ్రగ్స్ తీసుకుంటున్న ఉద్యోగులపై కఠిన చర్యలకు ఉపక్రమించాయి. మత్తు పదార్థాలకు బానిసలైన ఉద్యోగులపై వేటు వేశాయి. తాజాగా 13 మంది ఐటీ ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి. మరో 50 మంది ఉద్యోగులకు నోటీసులు ఇచ్చాయి.
పైగా, పోలీసులకు పట్టుబడిన డ్రగ్స్ పెడ్లర్ల వద్ద ఐటీ ఉద్యోగుల జాబితా ఉంది. దీంతో వీరి పేర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ వాడిన ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, మహీంద్రా క్యూసాఫ్ట్ ఉద్యోగులకు పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్ ఫెడ్లర్ టోనీ, ప్రేమ్ కుమార్, లక్ష్మీపతిల వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు వెల్లడైంది.