పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు... పవన్ కుమార్ అనే వ్యక్తి తన నివాసంలోనే మరణించివుండగా అతడి మృతికి పెంపుడు కుక్కదాడే కారణమని అనుమానిస్తున్నారు. మధురానగర్‌లో నివసించే కుమార్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అయితే, గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నాడు.
ఇటీవల పవన్‌ను కలిసేందుకు స్నేహితుడు సందీప్ అతడి ఇంటికి వెళ్లాడు. తలుపులు మూసి ఉండటంతో ఎంత పిలిచినా, తట్టినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చిన సందీప్, బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి ప్రవేశించాడు. అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న పవన్ కుమార్‌ను చూసి షాక్‌కు గురయ్యారు.
గదిలోనే ఉన్న పెంపుడు కుక్క నోటికి రక్తం అంటుకుని ఉండటాన్ని సందీప్‌ను గమనించాడు. పవన్ కుమార్ శరీరంపై గాయాలు ఉండటం, కుక్క నోటికి రక్తం ఉండటంతో ఆ కుక్కే పవన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి చంపి ఉంటుందని సందీప్ అనుమానం వ్యక్తం చేశాడు. కొన్ని శరీర భాగాలను కుక్క తినివేసినట్టు తెలుస్తోంది. వెంటనే సందీప్ మధురానగర్ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.