గ్రూపు పరీక్షలకు సిద్ధమవుతూ మానసిక ఒత్తిడితో యువతి ఆత్మహత్య!!

ఠాగూర్

ఆదివారం, 2 జూన్ 2024 (09:20 IST)
గ్రూపు పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని  మేడ్చల్‌ ఠాణా పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్గొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన కొమరాజు కృష్ణసాయి, తన అక్క కొమరాజు సంగీత (24) చదువుకునేందుకు మేడ్చల్ రాఘవేంద్ర నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. 
 
సంగీత గ్రూపు 1, 4 పరీక్షలకు నాలుగు నెలలుగా సన్నద్ధమవుతుంది. పరీక్షల విషయంలో చాలా భయమేస్తుందని ఇటీవల తమ్ముడితో చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం అతడు బయటకు వెళ్లాడు. 11 గంటల ప్రాంతంలో అక్కకు ఫోన్ చేయగా ఆమె తీయలేదు. అనుమానం వెంటనే వచ్చి తలుపులు బద్ధలు కొట్టాడు. ఫ్యాన్‌‍కు ఉరేసుకుని మతి చెందిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు