రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యంత భీతావహ హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ రాక్షస యువకుడు ఓ మహిళ తల నరికేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషను వద్దకు వచ్చి లొంగిపోయాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండల కేంద్రంలో ఓ మహిళ పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళుతోంది. ఆ సమయంలో ఎక్కడ నుంచి వచ్చాడో తెలియదు కానీ యముడులా ఆమెపై కత్తితో దాడి చేసాడు. తల నరికేశాడు.
అసలేం జరుగుతుందో తెలుసుకునేలోపే మహిళ తలను వేరు చేసి చంపేసాడు. ఆ తర్వాత నేరుగా పోలీసు స్టేషను వెళ్లాడు. పెద్దమ్మ గుడి ఎదురుగా ఓ మహిళను చంపేసాను. ఆమె తలను వేరు చేసా, ఆమె చచ్చిపోయింది అంటూ తన చేతిలోని కత్తిని పోలీసుల ముందు పెట్టేసాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.