ఈ వివరాలను పరిశీలిస్తే, కునిగల్ తాలూకాకు చెందిన శివరామ, పుష్పలతకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భార్యాభర్తలు తరచూ గొడవపడుతుండే వారు. కాగా, సోమవారం రాత్రి కూడా వారు శివరామ ఉద్యోగం విషయమై గొడవపడ్డారు. ఆ రాత్రి ఆమె అతడికి భోజనం పెట్టలేదు. దీంతో, తీవ్ర ఆగ్రహంలో విచక్షణ మరిచిన శివరామ కత్తి ఆమె తల నరికేశాడు.
కాగా, ఘటన స్థలిలో తమకు మహిళ మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందని పోలీసులు చెప్పాడు. నిందితుడు ఆమె చర్మం పూర్తిగా ఒలిచాడని తెలిపారు. నిందితుడు కూడా అక్కడే ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని అన్నారు.