ఇద్దరిని ప్రేమించింది, పెళ్ళి ఎవరిని చేసుకోవాలో తెలియక...

శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (21:17 IST)
ఇద్దరిని ప్రేమించింది. ఇద్దరితో శారీరకంగా కలుస్తోంది. ఇద్దరూ కావాలనుకుంటోంది. అయితే అందులో ఇద్దరూ తనను పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. ఏం చేయాలో నిర్ణయించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. చివరకు తనువు చాలించాల్సి వచ్చింది.

 
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల కేంద్రంలో నివాసముంటున్న ప్రసాద్‌కు లోకేశ్వరికి పరిచయం ఉంది. ఇద్దరూ ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఈ పరిచయం కాస్త ప్రేమ గాను ఆ తరువాత శారీరక సంబంధానికి కారణమైంది. లోకేశ్వరికి ప్రసాద్ అంటే ఎంతో ఇష్టం. 

 
ఇదిలా ఉంటే సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ప్రియదర్సిని నగర్‌కు చెందిన రాజశేఖర్ లోకేశ్వరికి పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. మొదట్లో రాజశేఖర్‌ను పక్కనబెట్టిన లోకేశ్వరి ఆ తరువాత అతనికి కూడా కనెక్టయ్యింది.

 
రాజశేఖర్‌తోను శారీరకంగా కలిసేది. అయితే ప్రసాద్ విషయాన్ని రాజశేఖర్‌కు, రాజశేఖర్ విషయాన్ని ప్రసాద్‌కు చెప్పకుండా జాగ్రత్త పడుతుండేది. పెళ్ళి చేసుకుందామంటూ ప్రసాద్, రాజశేఖర్ ఒత్తిడి చేస్తూ వచ్చారు. దీంతో ఎవరిని పెళ్ళి చేసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉండేది లోకేశ్వరి. ఇద్దరికి ఏం చెప్పి ఒప్పించాలో అర్థం కాక సతమతమై ఇంట్లో ఒంటరిగా పడుకున్న లోకేశ్వరి తాను పడుతున్న బాధను లేఖ ద్వారా రాసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు