దీంతో చాలామంది మహిళలు ఆయన దగ్గరకు వచ్చి చీరలకు మ్యాచింగ్‌లు, వారి శరీర ఆకృతికి ఎలాంటి చీర, చుడిదార్లు వేసుకుంటే బాగుంటుంది అడిగి వెళ్ళేవారు. ఇదే అతని కుటుంబం సర్వనాశనం కావడానికి కారణమవుతుందని అతను ఊహించలేకపోయాడు.
మహారాష్ట్ర పూణే సిటీలోని మోషి చిఖాలీ రోడ్డులో నివాసముంటున్నారు మొహ్సిన్ అజీమ్ జాకీర్ హుస్సేన్ షేక్, రజియా బేగం. పది సంవత్సరాల క్రితం వీరికి వివాహమైంది. ఒక కుమార్తె ఉంది. ఎంతో హాయిగా సాగిపోతున్న జీవితం. ప్రభుత్వ ఉద్యోగి జాకీర్. ఒక అపార్టుమెంటులో ఉంటున్నాడు.