భయానకంగా భార్య హత్య, చంపడంలో చావు తెలివితేటలు, పోలీసులకు సవాల్

ఠాగూర్

ఆదివారం, 26 జనవరి 2025 (20:18 IST)
ఏపీలోని ప్రకాశం జిల్లా జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్యను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి, శరీర భాగాలను కుక్కర్‌లో వేసి ఉడకబెట్టిన ఘటన తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఈ కిరాతక చర్యకు గురుమూర్తి అనే ఆర్మీ మాజీ అధికారి పాల్పడ్డాడు. ఈ నెల 15వ తేదీన ఈ ఘటన జరిగింది. సొంతూరులో పరాయి మహిళతో గురుమూర్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భార్య తరపు కుటుంబీకులు గురుమూర్తిపై దాడికి చేశారు. భార్యను హత్య చేశాక.. మృతదేహం కనిపిస్తే మరింత దారుణంగా స్పందిస్తారని భయపడ్డాడు. 
 
దీంతో ఇంటర్నెట్లో మృతదేహం ఎలా ముక్కలు చేయాలని వెతికాడు. గతంలో చైతన్యపురిలో నర్సు హత్య ఉదంతంతోపాటు కొన్ని వెబ్ సిరీస్‌లతో ప్రేరణ పొందాడు. ఇంట్లో అందుబాటులో ఉన్న హ్యాక్సా బ్లేడుతో తలను వేరుచేసి మొండేన్ని మూడు ముక్కలు చేశాడు. ఆ తర్వాత బకెట్లో వేడినీటిలో ముక్కల్ని ఉడికించిన తర్వాత మళ్లీ పెద్ద స్టవ్ మీద కాల్చాడు. ఈ క్రమంలో ముక్కలు మాంసం ముద్దలుగా మారిపోయాయి.
 
పొరుగింట్లోకి దుర్వాసన వెళ్లకుండా కొన్ని ద్రావణాలు పిచికారి చేశాడు. సాయంత్రం వరకూ ఈ పనిపూర్తి చేసి మీర్‌‍పేటలోని పెద్ద చెరువులో వేశాడు. ఆ తర్వాత తనకేం తెలియనట్లు భార్య తల్లిదండ్రులకు 93 ఫోన్ చేసి వెంకటమాధవి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, పోలీసులు మాత్రం గురుమార్తిని అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. 
 
ఆ తర్వాత అతడిచ్చిన సమాచారంతో చెరువులో మృతదేహం ముక్కల కోసం పోలీసులు వెతికారు. ఎలాంటి ఆనవాళ్లు లభించక.. ఫోరెన్సిక్, క్లూస్ టీంతో ఇంటిని పరిశీలించినప్పుడు తల వెంట్రుకలు, స్టవ్, వాటర్ బకెట్, హీటర్ వద్ద కొన్ని రక్తం, ఆనవాళ్లు లభించాయి. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ వెంకట మాధవివేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. డీఎన్ఏ విశ్లేషణా జరుగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు