పెళ్ళి చూపులకు వచ్చాడు. అమ్మాయి అందంగా కనిపించింది. ఆమె తల్లిదండ్రులను ఒప్పించి మాట్లాడాలన్నాడు. మాటలు కలిపాడు. చాలా అందంగా ఉన్నావని చెప్పాడు. ఎన్నో మాటలు చెప్పాడు. ఆమె నమ్మేసింది. నిన్ను తప్ప ఎవరినీ పెళ్ళి చేసుకోనన్నాడు. కట్నం అసలు వద్దన్నాడు. ఆమె ఎగిరి గంతేసినంత ఆనందపడింది. పెళ్ళయ్యింది. కానీ ఆ తరువాతే అతనిలోని బుద్ధి బయటపడింది.
విశాఖ జిల్లా రవీనాకు చెందిన ఉమ్మడి కిషోర్ కుమార్, సత్యవతిలకు నవంబర్ నెలలో వివాహం జరిగింది. సత్యవతి తల్లిదండ్రులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. కిషోర్ కుమార్ మాత్రం ఆస్తిపరుడు. అయితే అమ్మాయి నచ్చితే చాలు అనుకుని పెళ్ళి చూపులకు వెళ్ళాడు.
పెళ్ళి చూపుల్లోనే అమ్మాయిని చూసి ఫిదా అయ్యాడు. మాటలు కలిపాడు. ఎంతో అందంగా ఉన్నావని.. నిన్నే పెళ్ళి చేసుకుంటానన్నాడు. దీంతో సత్యవతి తన కుటుంబ పరిస్థితిని వివరించింది. తల్లిదండ్రులు అప్పు చేసి నా పెళ్ళి చేయాలనుకుంటున్నారు. కట్నం తీసుకోకుంటే బాగుంటుంది అని చెప్పింది. దీంతో సరేనన్నాడు. వివాహం బాగా జరిగింది. కానీ ఆ తరువాత కట్నం కోసం వేధించడం మొదలెట్టాడు.