ప్రకాశం జిల్లాలో నవ దంపతుల ఆత్మహత్య

సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (08:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దంపతులకు వివాహం జరిగి నెల రోజులు కూడా గడవలేదు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత యేడాది డిసెంబరు 29వ తేదీన ప్రియాంక - మహానందిలకు పెద్దలు వివాహం జరిపించారు. అయితే, మహానంది ఛత్తీస్‌గఢ్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అయితే, నవ దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడినట్టు సమాచారం. దీంతో వారిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
కుటుంబ కలహాల నేపథ్యంలో నవ వధువు ఆదివారం ముక్తినూతలపాడు గ్రామంలో ఆత్మహత్య చేసుకోగా, భార్య మరణవార్త తెలిసిన మహానంది జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విషయం తెలిసిన బంధువులు ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం, మేదరమెట్లలో విషాదం నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు