హైదరాబాద్ నగరంలో ఆన్‌లైన్ వేదికగా చేసుకుని హెటెక్ వ్యభిచారం చేస్తూ వచ్చిన ముఠాను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన సురేశ్ బోయిన, అఖిల్ కుమార్‌లు ఉన్నారు.
అనేక మంది యువతులకు సినిమా అవకాశాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి నమ్మించేవాడు. అలా, దేశంలోని ముంబై, ఢిల్లీ, బెంగాల్ వంటి వివిధ ప్రాంతాలకు చెందిన అమ్మాయిలను నగరానికి పిలిపించి, బలవంతంగా వ్యభిచారంలోకి దించేవాడు.
ఈ క్రమంలో ధనవంతులైన విటులను ఆకర్షించేందుకు అమ్మాయిల ఫోటోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తూ హైటెక్ రీతిలో విటులను ఆకర్షించేవారు. పైగా, సురేశ్ హైదరాబాద్ నగరంలోనే కాకుండా, గోవా, బెంగుళూరుల్లో కూడా వ్యభిచార వ్యాపారాలు నిర్వహించినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.