కన్నతండ్రిని రంపంతో కసకసా కోసిన కిరాతక కొడుకు...

ఠాగూర్

ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (18:52 IST)
తన ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్నతండ్రిని ఓ కిరాతక కుమారుడు రంపంతో కసకసా కోసి చంపేశాడు. ఈ దారుణం ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దొనకొండ మండలం, ఇండ్ల చెరువు అనే గ్రామంలోని ఎస్సీ కాలనీలో పైడిపోగు యేసయ్య (64) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. 
 
అయితే, ఈయన రెండో కుమారుడు మరిదాసు శనివారం మద్యం సేవించేందుకు తండ్రిని డబ్బులు ఇవ్వాలని కోరగా, తండ్రి ఇవ్వలేదు. దీంతో ఆగ్రహంతో విచక్షణ కోల్పోయిన మరిదాసు రాత్రి మద్యం సేవించి వచ్చి ఆ మత్తులో చెట్లు కోసే రంపంతో తండ్రిని హతమార్చాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు వచ్చి కసాయి కుమారుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు