తన తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని చూసి జీర్ణించుకోలేని ఓ కొడుకు తల్లివద్దకు వచ్చేవాడిని కరెంటు వైరుతో షాకిచ్చి చంపేసాడు. ఈ ఘటన కేరళలోని అలప్పుజలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కేరళలోని అలప్పుజలో కుంజుమాన్-అశ్వమ్మ దంపతులు. వీరికి 28 ఏళ్ల కుమారుడు కూడా వున్నాడు. వీరి జీవితం హ్యాపీగా గడిచిపోతున్న తరుణంలో వాళ్ల ఇంట్లోకి పొరుగింటి అంకుల్ రూపంలో పెనుతుఫాన్ చెలరేగింది. 50 ఏళ్ల అశ్వమ్మ పొరిగింటి దినేష్ అనే వ్యక్తికి ఆకర్షితురాలైంది. భర్త-కుమారుడు ఇంట్లో లేని సమయం చూసి అతడితో కోర్కె తీర్చుకునేది.
ఐతే ఈ విషయం కాస్తా కుమారుడు కిరణ్ పసిగట్టాడు. తండ్రికి చెప్పేసాడు. సున్నితమైన విషయం కనుక తల్లిని మందలించకుండా పొరుగింటి అంకుల్ వద్దకెళ్లి ఇకపై తమ ఇంటికి రావద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఐనప్పటికీ పక్కింటి వ్యక్తి పట్టించుకోలేదు. అర్థరాత్రి దాటాక దొడ్డి వాకిలి ద్వారా లోనికి ప్రవేశించి అశ్వమ్మను కలుస్తూనే వున్నాడు. ఇదంతా గమనిస్తున్న కిరణ్... అంకుల్ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసాడు. దొడ్డి వాకిలి మార్గంలో విద్యుత్ వైర్లు అమర్చి వాటికి కరెంట్ ఇచ్చాడు.
యధాప్రకారం పొరుగింటి అంకుల్ అర్థరాత్రి దాటాక దొడ్డి వాకిలి ద్వారా వచ్చేందుకు ప్రయత్నించి కరెంట్ తీగలకు తగులుకుని ప్రాణాలు విడిచాడు. అతడి శవాన్ని తండ్రీకొడుకులిద్దరూ సమీపంలోని పొలాల్లో పడేసి వచ్చారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు నిజం బైటపడింది. కిరణ్ తో పాటు అతడి తండ్రిని అరెస్ట్ చేసారు.